facebook pixel
chevron_right Entertainment
transparent
బాహుబలి తర్వాత శరభ
నరసింహారావు నా సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన దర్శకత్వం వహించిన 'శరభ' సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా ఉన్నాయి. 'బాహుబలి' తర్వాత నాకు విజువల్‌ పరంగా బాగా నచ్చిన చిత్రం 'శరభ అని నటుడు-దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. డా.జయప్రద, ఆకాశ్‌కుమార్, మిస్తి చక్రవర్తి, నెపోలియన్, నాజర్, పునీత్‌ ఇస్సార్, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్, పొన్‌వణ్ణన్, సాయాజీ షిండే, అవినాష్, పృథ్వీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'శరభ'. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనీకుమార్‌ సహదేవ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ చిత్రం మేకింగ్‌ వీడియోను ఆర్‌.నారాయణమూర్తి, ట్రైలర్‌ను నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రిలీజ్‌ చేశారు. నరసింహారావు మాట్లాడుతూ- కొత్త తరహా చిత్రమిది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App