facebook pixel
chevron_right Entertainment
transparent
రై.. రై... రైఫిల్‌
వీలైనంత తొందరగా షూటింగ్‌ను పూర్తి చేయాలని 'సైరా' టీమ్‌ భావిస్తున్నట్లుంది. ఇటీవల జార్జియాలో క్లైమాక్స్‌ను కంప్లీట్‌ చేసిన 'సైరా' టీమ్‌ పెద్ద గ్యాప్‌ తీసుకోకుండానే తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో మొదలుపెట్టింది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'సైరా: నరసింహారెడ్డి'. చిరంజీవి టైటిల్‌ రోల్‌లో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం చిరంజీవి రైఫిల్‌ షూట్‌ నేర్చుకుంటున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌లో రేపటి నుంచి నయనతార పాల్గొంటారని సమాచారం. అలాగే ఈ నెల 15న తమన్నా సెట్‌లో జాయిన్‌ అవుతారని వినికిడి.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App