facebook pixel
chevron_right Politics
transparent
ప్రజా సంకల్ప యాత్ర రేపు పునఃప్రారంభం
ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ 17 రోజుల విరామం అనంతరం ఈ నెల 12 నుంచి ప్రజా సంకల్ప యాత్రను పునఃప్రారంభించబోతున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆయన 11న బయలుదేరి అదే రోజు రాత్రికి పాదయాత్ర శిబిరానికి చేరుకుంటారు. మరుసటి రోజు సోమవారం ఉదయం నుంచి పాదయాత్రను కొనసాగిస్తారు. విశాఖపట్టణం విమానాశ్రయంలో గత నెల 25వ తేదీన జగన్‌పై హత్యాయత్నం జరిగాక హైదరాబాద్‌లో చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇవ్వడంతో పాదయాత్రకు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్‌ గాయం నుంచి కోలుకోవడంతో పాదయాత్రకు బయలు దేరనున్నారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో గత ఏడాది నవంబర్‌ 6వ తేదీన ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించిన జగన్‌.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App