facebook pixel
chevron_right Top
transparent
పోలీసుల ఎదుట హాజరైన గాలి
మూడు రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దన రెడ్డి ఎట్టకేలకు శనివారం బెంగళూరులో తన లాయర్‌ చంద్రశేఖర రెడ్డితో కలిసి పోలీసుల ఎదుట హాజరయ్యారు. యాంబిడంట్‌ కేసులో తనపై వస్తున్న ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందనీ, ఈ కేసుతో తనకు అసలు ఏ సంబంధమూ లేదని జనార్దన రెడ్డి చెప్పారు. 'నేను ఏ తప్పూ చేయలేదు. నేను తప్పు చేశానని నిరూపించేలా పోలీసుల వద్ద ఒక్క పత్రమూ లేదు' అని అంతకుముందు ఆయన ఓ వీడియో విడుదలచేశారు. ఆదివారం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా సీసీబీ (సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌) జనార్దన రెడ్డికి నోటీసులు పంపడం తెల్సిందే.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App