facebook pixel
chevron_right Top
transparent
రసాభాసగా టిప్పు జయంతి వేడుకలు
బీజేపీ, ఇతర హిందూ సంస్థల ఆందోళనల నడుమ 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలు శనివారం కర్ణాటకలో రసాభాసగా జరిగాయి. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి సీఎం కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి పరమేశ్వర రాలేదు. సీఎం ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం ముస్లిం వర్గాన్ని అవమానించడమేనని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు అన్నారు. అధికారిక కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎంలు డుమ్మాకొట్టడంపై ముస్లిం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తంచేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన పార్టీకి పట్టున్న మైసూరు ప్రాంతంలో ఓటర్లను దూరం చేసుకోకూడదనే సీఎం ఈ కార్యక్రమానికి గైర్హాజరైనట్లు భావిస్తున్నారు. కానీ టిప్పు గొప్ప పాలకుడని, ఆయన సేవలు కొనియాడుతూ కుమారస్వామి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App