facebook pixel
chevron_right Top
transparent
సరిహద్దులో మాటువేసి మట్టుబెట్టారు
జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ)వెంట పాక్‌ స్నైపర్‌ (దొంగచాటు) జరిపిన కాల్పుల్లో ఒక జవాను నేలకొరగగా పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు మృతి చెందారు. సుందర్‌బనీ సెక్టార్‌లో శనివారం ఉదయం 9.45 గంటల సమయంలో పాక్‌ స్నైపర్‌ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జవాను ఆస్పత్రిలో చనిపోయాడు. మృతుడిని సాంబా జిల్లా మావా-రాజ్‌పురా ప్రాంతానికి చెందిన వరుణ్‌ కట్టల్‌(21)గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా పాక్‌ బలగాలు పాల్పడిన ఈ చర్యకు భారత బలగాలు దీటుగా బదులిచ్చాయన్నారు. కాగా, ఎల్‌వోసీ వెంట పాక్‌ ఈనెల 9వ తేదీన జరిపిన స్నైపర్‌ కాల్పుల్లో ఆర్మీ సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App