facebook pixel
chevron_right Entertainment
transparent
మంచి చేసే మాస్టర్‌
నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా 'బ్లఫ్‌ మాస్టర్‌'. మా సంస్థ ఈ సినిమాని సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది రీమేక్‌ చిత్రమే అయినప్పటికీ, చాలా మార్పులు చేసి, గోపి బాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరినీ ఆయన ఏరికోరి ఎంపిక చేసుకున్నారు అని శివలెంక కృష్ణప్రసాద్‌ అన్నారు. సత్యదేవ్, నందితా శ్వేత, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, పృథ్వి, సిజ్జు, చైతన్యకృష్ణ, 'టెంపర్‌' వంశీ, 'దిల్‌' రమేశ్‌ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం 'బ్లఫ్‌ మాస్టర్‌'. గోపీ గణేష్‌ పట్టాభి దర్శకత్వంలో రమేష్‌.పి.పిళ్లై నిర్మించారు. శ్రీదేవి మూవీస్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ- బ్లఫ్‌ మాస్టర్‌' కథకు సత్యదేవ్‌ పక్కాగా న్యాయం చేశారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App