facebook pixel
chevron_right Politics
transparent
అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందే
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలో ఆయన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నిలుపుకోలేదని, ఇలాంటి అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంపదను దోచుకోవడంపైనే దృష్టి సారించిందని విమర్శించారు. ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మరోసారి అధికారంలోకి వస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App