facebook pixel
chevron_right Top
transparent
కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. తొమ్మిది మంది మృతి
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర అడవుల్లో శుక్రవారం సంభవించిన కార్చిచ్చు కారణంగా తొమ్మిది మంది మృతి చెందారు. కాలిఫోర్నియా బుట్టే కౌంటీలోని ప్యారడైజ్ పట్టణం నుంచి హాలీవుడ్ తారలు నివాసం ఉండే మాలిబు రిసార్ట్ వైపు మంటలు దూసుకు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వేగంగా గాలి వీస్తుండటంతో అగ్నికీలలు 70 వేల ఎకరాల మేర విస్తరించాయి. ఫలితంగా 6700 భవనాలు దెబ్బతిన్నాయి. 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలిఫోర్నియా గవర్నర్‌గా ఎన్నికైన గావిన్ నెవ్సమ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోవైపు హెలికాప్టర్లు, 2,200కి పైగా ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App