facebook pixel
chevron_right Top
transparent
అయోధ్యలో బుద్ధుడి విగ్రహం ప్రతిష్టించాలి
యూపీ బీజేపీ దళిత ఎంపీ సావిత్రీబాయి పూలే డిమాండ్గోండ (యూపీ), నవంబర్ 10: అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని ఓ వైపు బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తుండగా ఆ పార్టీకే చెందిన బరేక్ (ఉత్తర్‌ప్రదేశ్) దళిత ఎంపీ సావిత్రీబాయి పూలే సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో భారీ బుద్ధుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులతో అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్నాయి. ఇందులో బుద్ధుడికి సంబంధించిన పలు వస్తువులు బయటపడ్డాయి. బుద్ధుడికి అయోధ్యతో అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఈ స్థలంలో తథాగతుడి భారీ విగ్రహం నిర్మించాలి అని సావిత్రీబాయి కోరారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App