facebook pixel
chevron_right Sports
transparent
విండీస్‌ దెబ్బకు బంగ్లా బేజారు
తాము తక్కువ స్కోరుకే పరిమితమైనా, ప్రత్యర్థిని మరింత దారుణంగా కుప్పకూల్చింది. మహిళల టి20 ప్రపంచ కప్‌లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ డిండ్రా డాటిన్‌ (5/5) మెరుపు బౌలింగ్‌తో వెస్టిండీస్‌ 60 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. వికెట్‌ కీపర్‌ కిసియా నైట్‌ టాప్‌ స్కోరర్‌. కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌ (29) ఫర్వాలేదనిపించింది. బంగ్లాకు అదే కొండలా కనిపించింది. డాటిన్, షకీరా సెల్మన్‌ (2/12) జోరుకు ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఫర్జానా హక్‌ (8) చేసిన స్కోరే అత్యధికం కావడం గమనార్హం. డాటిన్‌ 3.4 ఓవర్లు వేసి ఐదు పరుగులే ఇచ్చి.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App