facebook pixel
chevron_right Politics
transparent
చేతి నుంచి మాయం!
2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశమంతా అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్కటే కాంగ్రెస్‌ నేతృత్వంలో మహాకూటమికి సిద్ధమవుతున్నాయి. యూపీలో బలమైన అస్తిత్వం ఉన్న బీఎస్పీ కలుస్తుందా లేదా? ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఎస్పీ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తాయంటూ వార్తలొచ్చాయి. దీనిపై చర్చ జరుగుతుండగానే కాంగ్రెస్‌కు బై చెప్పిన మాయావతి సొంత ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లో జోగితో కలిసి, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మూడు రాష్ట్రాల్లో అగ్రవర్ణాలు, ఓబీసీలు దూరం కావొద్దనే బీఎస్పీతో పొత్తుకు కాంగ్రెస్‌ విముఖత వ్యక్తం చేసిందని విశ్లేషకులంటున్నారు. బీఎస్పీతో పొత్తును కాంగ్రెస్‌ లైట్‌ తీసుకోవడం మంచి నిర్ణయం కాదని కొందరు పరిశీలకుల అభిప్రాయం.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App