facebook pixel
chevron_right Politics
transparent
వీళ్లా ప్రభుత్వాన్ని నడిపేది?
'శాసనసభ రద్దయి రెండు నెలలైంది. వీళ్ల ముఖాలకు కలసి కూర్చుని సీట్లు పంచుకునే తెలివిలేదు. ఏట్లో రాయి తీస్తరట'అని మహాకూటమిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో శనివారం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ లో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ. కూటమి సీట్లు పంచుకునేలోపే మనం స్వీట్లు పంచుకుంటామని చెప్పారు. 'రాహుల్‌ సీట్లిస్తే, చంద్రబాబు నోట్లు ఇస్తున్నడు. రాహుల్‌ సీట్లకు, చంద్రబాబు ఓట్లకు తెలంగాణ ప్రజలు ఓట్లతో బుద్ధిచెప్పాలె'అని పిలుపునిచ్చారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలని సీఎం కేసీఆర్‌ పనిచేస్తుంటే. ప్రాజెక్టులను అడ్డుకోడానికి ఉత్తరాలు రాసిన చంద్రబాబుతో జతకట్టిన మాయాకూటమిని నమ్మి మోసపో వద్దని చెప్పారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App