facebook pixel
chevron_right Politics
transparent
పెండింగ్‌ స్థానాల అభ్యర్థుల ఖరారు!
టీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహాల్లో వేగం పెంచుతోంది. ఆపార్టీ విడుదల చేసిన తొలిజాబితాలో అభ్యర్థులను ప్రకటించకుండా ఆపిన 12 స్థానాలకు పోటీచేసే నేతల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ మేరకు శనివారం కసరత్తు పూర్తి చేశారు. ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే అసంతృప్తికి గురయ్యే నేతలతో మాట్లాడాలని మంత్రి కేటీఆర్‌ను ఆదేశించగా ఆయ న కూడా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పెండింగ్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా కేటీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారు. టికెట్‌ ఆశిస్తున్న వారితో తానే స్వయంగా మాట్లాడారు. ద్వితీయశ్రేణి నేతలతో మాట్లాడే బాధ్యతను ఆయా జిల్లాల ముఖ్యనేతలకు అప్పగించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఆదివారం బీఫారాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణ యించారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App