facebook pixel
chevron_right Sports
transparent
అంతర్జాతీయ క్రికెట్‌కు మునాఫ్ వీడ్కోలు
అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ పేసర్ మునాఫ్ పటేల్ వీడ్కోలు పలికాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు మునాఫ్ ప్రకటించాడు. 2006 మార్చిలో ఇంగ్లండ్‌పై టెస్ట్ అరంగేట్రం చేసిన మునాఫ్. తన కెరీర్‌లో 13 టెస్ట్‌లు, 70వన్డేలు, 3టీ20 మ్యాచ్‌లాడాడు. అయితే గత కొంతకాలంగా అటు దేశవాళీ క్రికెట్‌కు తోడు జాతీయ జట్టుకు దూరమైన 35 ఏండ్ల పటేల్ తాజాగా రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఈ సందర్భంగా తన నిర్ణయంపై మాట్లాడుతూ నాతో ఆడిన క్రికెటర్లందరూ ఇప్పటికే రిటైర్ అయ్యారు. ఒక ధోనీ మాత్రమే మిగిలున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. వయస్సు పైబడటానికి తోడు ఫిట్‌నెస్ సమస్యలు వేధిస్తున్నాయి. యువకులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటప్పుడు జట్టును పట్టుకుని వేలాడటం సరికాదు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App