facebook pixel
chevron_right Business
transparent
దిగొస్తున్న బంగారం ధరలు
బంగారం ధరలు క్రమేణా తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం బులియన్ మార్కెట్‌లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పుత్తడి విలువ రూ.180 క్షీణించి రూ.32,070 వద్ద స్థిరపడింది. అంతకుముందు మూడు రోజుల్లోనూ రూ.440 మేర దిగజారింది. 99.5 స్వచ్ఛత ఉన్న పసిడి ధర కూడా ప్రస్తుతం రూ.31,920 వద్ద నిలిచింది. స్థానికంగా నగల వర్తకుల నుంచి డిమాండ్ అంతంతమాత్రంగా ఉండటం, అంతర్జాతీయ విపణిలోనూ సెంటిమెంట్ బలహీనంగా కనిపిస్తుండటం పసిడి విలువ పతనానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు ధర 1,210.40 డాలర్ల దిగువకు చేరింది. నిజానికి పెండ్లిండ్ల సీజన్‌లో బంగారానికి విశేష ఆదరణ లభించడం సహజం.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App