facebook pixel
chevron_right Business
transparent
ఆర్బీఐ సమర్థతకు పరీక్ష
ఒకటి దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం. మరొకటి దేశ పాలనా వ్యవస్థకే కేంద్ర బిందువు. అవే ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం. ఈ రెండింటి మధ్య ఇప్పుడు విభేదాలు నెలకొనగా, ఈ నెల 19న జరిగే బోర్డు సమావేశం ఆర్బీఐ సమర్థతకే పరీక్ష కానున్నది. రిజర్వ్ బ్యాంక్ స్వేచ్ఛను మోదీ సర్కారు హరించి వేస్తున్నదని డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య విమర్శలకు దిగడం, బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్బీఐ పట్టు కోల్పోయిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రతివిమర్శలు చేయడం, ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ను కేంద్రం ప్రయోగించాలని ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలు రావడం, గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామాకు సిద్ధమయ్యారన్న వార్తలు వెలువడటం చకచకా జరిగిపోయిన విషయం తెలిసిందే.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App