facebook pixel
chevron_right Top
transparent
హైదరాబాద్ మినీ భారతదేశం: కేటీఆర్
హైదరాబాద్ మినీ భారతదేశం అని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ కమ్యూనిటీ హాల్‌లో హమారా హైదరాబాద్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ. కోర్టు కేసుల వల్ల అయ్యప్ప సొసైటీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయామన్నారు. కోర్టు పరిధిలోని విషయాలు మినహాయిస్తే అయ్యప్ప సొసైటీలో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. 2014 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌పై ఎన్నో అసత్య ప్రచారాలు జరిగాయని మంత్రి తెలిపారు. విభజన వికాసం కోసమే అని ఆనాడే చెప్పామని మంత్రి అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌కు 99 సీట్లు కట్టబెట్టారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎప్పుడూ ప్రాంతీయ విద్వేషాలు చూపించలేదు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App