facebook pixel
chevron_right Top
transparent
భార్యకోసం తాజ్‌మహల్ కట్టిన వృద్ధుడు ప్రమాదంలో కన్నుమూశాడు
రాజులు, చక్రవర్తులేనా తమ భార్యలకు స్మారక చిహ్నాలు నిర్మించేది? నేనేం తక్కువ తిన్నానా అని యూపీలోని బులంద్‌హర్ జిల్లాకు చెందిన రిటైర్డు పోస్టుమాస్టర్ ఫైజుల్ హసన్ ఖాద్రీ తన భార్య కోసం మినీ తాజ్‌మహల్ నిర్మాణం మొదలుపెట్టాడు. సుమారు 60 ఏళ్లు కాపురం చేసిన అతని భార్య 2012లో కన్నుమూసింది. ఆమె మీది ప్రేమతో మినీ తాజమహల్ నిర్మాణం చేపట్టాడు ఖాద్రీ. తన పొలంలోనే తన భార్య సమాధిని తాజ్‌మహల్‌కు నకలుగా తీర్చిదిద్దేందుకు అహోరాత్రాలు కృషి చేశాడు. కానీ ఇంకా చాలా పని ఉంది. కానీ తన దగ్గర డబ్బులు మాత్రం అయిపోయాయి. ఇక ఆ ప్రేమమందిరం పూర్తికాదేమో. ఎందుకంటే ఖాద్రీ ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి శుక్రవారం దవాఖానలో కన్నుమూశాడు. ఆయన వయసు 83 సంవత్సరాలు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App