facebook pixel
chevron_right Politics
transparent
'కాంగ్రెస్, టీడీపీ కలవడం మంచి పరిణామం'
దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించే ఉద్ధేశ్యంతోనే టీడీపీతో చేతులు కలిపామని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్‌ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశం మేరకు విజయవాడకు వచ్చానని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసేందుకు విజయవాడ వచ్చానన్నారు. బీజేపీని 2019 ఎన్నికల్లో ఓడించేందుకే ఈ రోజు దేశంలోని రాజకీయ పార్టీలన్నీ మహా కూటమిగా ఏర్పడుతున్నాయని చెప్పారు. దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెంది ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే మతతత్వపార్టీలను తరిమివేయాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, టీడీపీ కలవడం మంచి పరిణామమని పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై చంద్రబాబుతో చర్చించిన తర్వాతే రాహుల్‌ ఏపీకి వచ్చే తేదీలు ఖరారు చేస్తామన్నారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App