facebook pixel
chevron_right Politics
transparent
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం : మీడియాతో మాట్లాడనున్న విజయమ్మ
విశాఖ విమానాశ్రయంలో గత నెల 25న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇంతవరకు వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులెవరూ మీడియాతో మాట్లాడలేదు. కాగా ఈ ఘటనపై తొలిసారిగా వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు, వైఎస్‌ జగన్‌ తల్లి విజయమ్మ స్పందించనున్నారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్న ఘటనపై ఆదివారం ఉదయం 11 గంటలకు వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతారని వైస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 12న ప్రజాసంకల్పయాత్ర పున:ప్రారంభం. ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రను నవంబర్‌ 12 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App