facebook pixel
chevron_right Top
transparent
ట్రంప్‌కు మోదీకీ పోలికేమిటీ?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకీ కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయి. ఇద్దరికి మీడియా అంటే పడదు. దేశ సమస్యల పరిష్కారం కోసం తాము నిరంతరం పనిచేసే పాలనాదక్షులమని వారి విశ్వాసం. మీడియాతో సహా ఎవరైనా సరే తమను ప్రశ్నించరాదనే అహంభావం వారిది. అందుకే నవంబర్‌ ఏడవ తేదీన వైట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డోనాల్డ్‌ ట్రంప్, సీఎన్‌ఎన్‌ జర్నలిస్ట్‌ జిమ్‌ అకోస్టాపై మండిపడ్డారు. మరోసారి వైట్‌హౌజ్‌కు రాకుండా ఆ విలేకరి మీడియా పాస్‌ను కూడా రద్దు చేయించారు. మెక్సికో నుంచి వస్తున్న వలసదారుల గురించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై విలేకరి ప్రశ్నించినందుకు ట్రంప్‌కు కోపం వచ్చింది. విలేకరి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App