facebook pixel
chevron_right Politics
transparent
టీడీపీకి ఓటేస్తే సంక్షోభమే : హరీష్‌ రావు
మహాకూటమిని వేదికగా చేసుకుని తాజా మాజీ మంత్రి హరీష్‌రావు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. పాలమూరు దిండి ప్రాజెక్టు అక్రమైనదని కేంద్ర మంత్రి ఉమా భారతికి గతంలో లేఖ రాసిన చంద్రబాబు. ఇప్పుడు తెలంగాణలో ఏవిధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆంధ్ర ప్రభుత్వం నిన్న దిండి ప్రాజెక్టుపై మాట్లాడుతూ. దానిని ఖచ్చితంగా అడ్డుకుంటామని ప్రకటించింది. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే వారికి మనం ఓట్లు ఎందుకు వెయ్యాలి. మహాకూటమికి ఓటేస్తే మన అస్థిత్వాన్ని బాబు దగ్గర తాఖట్టు పెట్టినట్టే. కూటమిలో చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చంద్రబాబు వద్ద ఏమైనా హామీ తీసుకున్నారా?.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App