facebook pixel
chevron_right Sports
transparent
బౌన్సర్‌కు పాక్‌ బ్యాట్స్‌మన్‌ విలవిల
న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కివీస్‌ బౌలర్‌ లాకీ ఫెర్గూసన్ వేసిన బౌన్సర్. ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్‌ హ్యూస్‌ను గుర్తుచేసింది. అంతటి ప్రమాదకర బౌన్సర్‌కు పాక్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ విలవిలాడాడు. ఫెర్గూసన్‌ వేసిన బౌన్సర్‌ నేరుగా ఇమామ్‌ హెల్మెట్‌కు తగిలింది. దీంతో అతను మైదానంలో కుప్పకూలాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా మైదానంలోని ఆటగాళ్లు. వెంటనే మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన ఫిజియో ఇమామ్‌కు ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశాడు. కానీ ఇమామ్‌ గాయం తీవ్రంగా ఉండటంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App