facebook pixel
chevron_right Top
transparent
చంద్రబాబు.. ఈ వీడియో చూసి ఇకనైనా మారండి!
భారత్‌లో నాలుగో అతిపెద్ద నగరం భాగ్యనగరం. హైదరాబాద్ నగరానికి 400ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి పూర్వమే ఈ నగరానికి విదేశాల నుంచి ఎంతో మంది వ్యాపారులు ఇక్కడికి వస్తూ ఉండేవారు. ప్రపంచంలో ఉన్న అతిపురాతనమైన నగరాల్లో భాగ్యనగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. చార్మినార్ పరిసరాల్లో నిత్యం కొనుగోళ్లతో కళకళలాడుతూ ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్‌క్రెడిబుల్ ఇండియా సహకారంతో ది ఎకనామిస్ట్ వెబ్‌సైట్ హైదరాబాద్ నగర చరిత్రపై ప్రత్యేక వీడియోను రూపొందించింది. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App