facebook pixel
chevron_right Top
transparent
వలసలకు అడ్డుకట్ట వేసి ఉపాధి చర్యలు తీసుకున్నాం: ఎంపీ కవిత
67 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ ఆగమైందని ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్‌లో ఎంపీ కవిత మీడియాతో మాట్లాడుతూ. తెలంగాణ ప్రజల్ని అడుగడుగునా మభ్యపెట్టి కాంగ్రెస్, టీడీపీ నేతలు బతికారన్నారు. 2006 నుంచి 2011 వరకు ఎన్నారై సెల్ ఏర్పాటు చేసి ఒక్క పైసా ఇవ్వలేదని దుయ్యబట్టారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు చిన్న ప్రయత్నం కూడా చేయలేదని చెప్పారు. గల్ఫ్‌లో ఈ నాలుగేళ్లలో 1278 మంది చనిపోతే అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడి స్వస్థలాలకు తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వ చర్యలతో వలసలకు అడ్డుకట్ట వేసినమని. సొంత గ్రామాల్లోనే ఉపాధి చర్యలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App