facebook pixel
chevron_right Top
transparent
పొత్తుల కత్తులు.. మహాకూటమిలో అస్తవ్యస్తం
మహాకూటమి పేరుతో జరుగుతున్న పొత్తులు క్షేత్రస్థాయిలో బెడిసికొడుతున్నాయి. ఇప్పటికే శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్‌లో వీరంగం సృష్టించగా, తాజాగా మల్కాజిగిరి స్థానాన్ని తెలంగాణ జనసమితికి కేటాయిస్తున్నట్లు వస్తున్న వార్తలను అక్కడి కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ శుక్రవారం గాంధీభవన్‌లో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. రోజుకో ప్రాంతానికి చెందిన నేతలు, కార్యకర్తలతో గాంధీభవన్ ధర్నాలు, ఆందోళనలతో ఉడికిపోతోంది. కాంగ్రెస్ పార్టీ సుమారు 74మంది అభ్యర్థులతో మొదటి జాబితాను శనివారం వెల్లడించే అవకాశముంది.ఈ నేపథ్యంలో కూటమి పొత్తుల్లో భాగంగా మల్కాజిగిరి స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించినట్లు స్థానిక కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం వారు స్థానికంగా ఆందోళనకు దిగారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App