facebook pixel
chevron_right Top
transparent
సీఎం దత్తత గ్రామాలపై.. కలెక్టర్ ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రి దత్తత గ్రామాలపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు ప్రభుత్వ పథకాల అమలుపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్న కలెక్టర్ అభివృద్ధి పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో ముఖాముఖి అవుతూ ప్రజల ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండల పరిధిలోని లకా్ష్మపూర్, కేశవరం, మూడుచింతలపల్లి గ్రామాలను అభివృద్ధికి చిరునామాగా మార్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ గతేడాది ఈ మూడు గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనుల నిమిత్తం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి రూ.57 కోట్లను మంజూరు చేశారు. ఇందులో లకా్ష్మపూర్‌కు రూ.15 కోట్లు, మూడు చింతలపల్లికి రూ.29 కోట్లు, కేశవరంకు రూ.13 కోట్లు కేటాయించారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App