facebook pixel
chevron_right Business
transparent
ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. 76మంది ప్రయాణీకులతో బయలుదేరిన ఇండిగో విమానం కోలకతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం 8.30 గంటలకు అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. గువహటికి వెళ్లా‍ల్సిన విమానం టేకాఫ్‌ తీసుకున్నకొన్నినిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్‌ కావాల్సి వచ్చిందని అధికారులు ప్రకటించారు. కాక్‌పిట్లో పొగ అలారం మోగడంతో పైలట్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) విభాగానికి సమాచారం అందించారని తెలిపారు. పైలట్‌ అప్రతమత్తతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ప్రయాణీకులు, సిబ‍్బందితోపాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App