facebook pixel
chevron_right Top
transparent
రిస్క్‌ ఎందుకు: కాంగ్రెస్ గుర్తుపైనే కోదండం రాం పార్టీ అభ్యర్థులు పోటీ..?
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ప్రచారంలో గులాబీ పార్టీ దూసుకెళుతుండగా ప్రజాకూటమి మాత్రం ఇంకా సీట్ల పంపకాలపైనే కాలయాపన చేస్తోంది. టీడీపీ, తెలంగాణ జనసమితి, కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నికలకు వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రొఫెసర్ కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితికి ఈ మధ్యే అగ్గిపెట్ట గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. కానీ ఆ గుర్తు ప్రజల్లోకి ఇంకా వెళ్లలేదు. దీంతో రిస్క్ చేయడం ఎందుకని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అభ్యర్థులు కాంగ్రెస్ గుర్తుపైనే పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App