facebook pixel
chevron_right Technology
transparent
నమస్తే ఇండియా అంటున్న ఇన్‌స్టా‌గ్రామ్
ఫేస్‌బుక్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రముఖ షేరింగ్ యాప్ ఇన్‌స్టా‌గ్రామ్ ఇండియాలో మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా హిందీ లాంగ్వేజ్ సపోర్టుతో సరికొత్తగా ఫీచర్లు రానున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ యాప్ రీసెర్చర్ Jane Manchun Wong ట్విట్టర్ లో ఓ స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు.ఈ స్క్రీన్ షాట్ లో కామెంట్లు,సెట్టింగ్స్ మెనూ, ప్రొఫైల్,అన్నీ హిందీ లాంగ్వేజ్ లో దర్శనమిస్తున్నాయి. IGTV section కూడా హిందీలో దర్శనమిస్తోంది. కాగా ఇప్పటికే ఇన్‌స్టా‌గ్రామ్ అనేక రకాలైన భాషలను సపోర్ట్ చేసే విధంగా తీర్చి దిద్దారు. వీటిల్లో French, German, Arabic, Korean, Vietnamese ఇలా అనేక రకాల భాషలు ఉన్నాయి. ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ సపోర్ట తో రావడం నిజంగా హర్షించదగ్గ పరిణామం.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App