facebook pixel
chevron_right Top
transparent
భార్యతో గొడవ.. మనస్తాపంతో భర్త...
భార్యతో గొడవపడి మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జార్ఖండ్‌కు చెందిన మదన్ రాయ్(26) బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి బంజారాహిల్స్ రోడ్ నం.14లోని నందీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆరునెలల క్రితం కంచన్‌దేవి అనే యువతితో వివాహం జరిగింది. మద్యం సేవించి వచ్చిన భర్తతో కంచన్‌దేవి గొడవపడింది. దాంతో ఆగ్రహానికి గురైన మదన్ అమెపై చేయిచేసుకున్నాడు. దాంతో ఆమె బయటకు వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన మదన్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన భార్య కంచన్‌దేవి లోనికి వెళ్లిచూడగా భర్త మృతదేహం కనిపించింది. కంచన్‌దేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App