facebook pixel
chevron_right Top
transparent
అమ్మానాన్నా.. తప్పకుండా ఓటెయ్యండి!
అతి తక్కువ ఓటింగ్ నమోదయ్యే హైదరాబాద్ జిల్లాలో ఈసారి ఎలాగైనా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో), జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 7న పోలింగ్ జరుగనుండడంతో తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనాలని కోరుతూ స్కూలు పిల్లల ద్వారా వారి తల్లిదండ్రులకు లేఖలు పంపాలని ఆయన నిర్ణయించారు. ఓటింగ్ శాతం పెంపునకు ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రచారం నిర్వహించడమే కాకుండా బస్తీలు, కాలనీ సంఘాలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓటుహక్కు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రాల రూపం లో ముద్రించిన లేఖలను జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల పిల్లల ద్వారా వారి తల్లిదండ్రులకు పంపాలని నిర్ణయించారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App