facebook pixel
chevron_right Top
transparent
పీఎస్‌ఎల్‌వీ-సీ42 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ42 ప్రయోగం విజయవంతమైంది. నిర్ణీత కక్షలోకి బ్రిటన్‌కు చెందిన నోవాసర్, ఎస్1-4 ఉపగ్రహాలు ప్రవేశించాయి. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక ద్వారా విదేశీ ఉపగ్రహాలు ప్రయోగించారు. నోవాసర్, ఎస్1-4 ఉపగ్రహాలు భూమిని పరిశీలించనున్నాయి. సర్వే శాటిలైట్ టెక్నాలజీ నోవాసర్, ఎస్1-4 ఉపగ్రహాలకు రూపకల్పన చేసింది. వాణిజ్య ప్రయోజనాలే లక్ష్యంగా ఇస్రో ఉపగ్రహాలను ప్రయోగించారు.పీఎస్‌ఎల్వీ-సీ42 అంతరిక్ష వాహకనౌక ద్వారా బ్రిటన్‌కు చెందిన రెండు ఉపగ్రహాలు నోవాసర్, ఎస్1-4లను నింగిలోకి పంపారు. 889కిలోల బరువున్న ఈ ఉపగ్రహాలను సూర్యుడి స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అడవుల పరిధిని లెక్కగట్టడంతోపాటు వరదలు, విపత్తుల పర్యవేక్షణకు అవసరమైన సమాచారాన్ని ఈ శాటిలైట్‌లు అందించనున్నాయి.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App