facebook pixel
chevron_right Top
transparent
టీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న వలసలు..
టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. పెద్దవంగర మండలం, గంట్లకుంట గ్రామం, రామోజీ తండాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమన్, గణేష్, వెంకటేష్, శ్రీకాంత్ తోపాటు పలువురు యువకులు టీఆర్ఎస్ లో చేరారు. అదేవిధంగా పెద్దవంగర మండలం కుమ్మరి సంఘం అధ్యక్షుడు పి.రమేష్, ప్రధాన కార్యదర్శి మురళీ, రంగయ్య, రామారపు రాజు, యల్.బి తండా నుండి జే శ్రీనివాస్. డి సురేష్ కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లో చేరారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతిస్తామని, ఎమ్మెల్యే అభ్యర్థి దయాకర్ రావు ను గెలిపిస్తామని ప్రకటించారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App