facebook pixel
chevron_right Politics
transparent
చింతమనేనిపై పోరుబాట: దీక్షను విరమించిన అబ్బయ్య చౌదరి
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అక్రమాలపై గళమెత్తుతూ వైఎస్సార్‌సీపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షను విరమించారు. ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, గన్నవరం కన్వీనర్ యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం సాయంత్రం నిమ్మరసం ఇచ్చి ఆయన దీక్షను విరమింపజేశారు. చింతమనేని ఇసుక అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలనే డిమాండుతో కొఠారు అబ్బయ్య చౌదరి శనివారం నుంచి దీక్షకు దిగారు. దీక్ష విరమణ అనంతరం వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాయన్నపాలెం నుంచి గోపన్నపాలెం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చింతమనేని అక్రమాలపై విచారణ జరిపి. ఆయనపై చట్టబద్ధమైన చర్యలు తీసుకునేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App