facebook pixel
chevron_right Entertainment
transparent
'కలెక్షన్‌లు చెప్పినప్పుడు నమ్మలేకపోయాను'
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, అను ఇమ్మాన్యూల్‌ జంటగా డైరక్టర్‌ మారుతి తెరకెక్కించిన శైలజా రెడ్డి అల్లుడు బాక్సాఫీస్‌ వద్ద కలక్షన్ల వర్షం కురిపిస్తుంది. వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మూడు రోజుల్లో దాదాపు 23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందుకు సంబంధించి చిత్ర బృందం పీపుల్స్‌ బ్లాక్‌బస్టర్‌ పేరిట పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్‌ ఆదివారం థ్యాంక్స్‌ మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య మాట్లాడుతూ. శైలజా రెడ్డి చిత్రాన్ని ఘనవిజయం చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App