facebook pixel
chevron_right Top
transparent
ప్రతిపక్షాల తప్పుడు మాటలు...ఎంత వరద వచ్చినా రాజధాని మునగదు:సిఎం చంద్రబాబు
రైతులు రాజధాని కోసం 33వేల ఎకరాలు త్యాగం చేస్తే. ప్రతిపక్ష నేతలు మాత్రం రాజధాని మునుగుతుందని. రాజధానిలో పనులు జరక్కుండానే లక్ష కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు మాటలు మాట్లాడారు. ఈ పథకానికి రోజుకు ఒక టీఎంసీ వరద వచ్చినా సమస్య లేదని సిఎం చంద్రబాబు చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని వరద ముంపు నుంచి రక్షించేందుకు నిర్మించిన కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మీట నొక్కి పంపుహౌజ్‌లో మోటార్లను ప్రారంభించారు. ఉండవల్లి వద్ద కృష్ణానది కరకట్ట సమీపంలో రూ.2 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని నిర్మించారు. 5వేల క్యూసెక్కుల వరదనీటిని కృష్ణానదిలో ఎత్తిపోసేలా దీన్ని డిజైన్‌ చేశారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App