facebook pixel
chevron_right Top
transparent
ప్రణయ్ హత్య దిగ్భ్రాంతికి గురి చేసింది: మంత్రి కేటీఆర్
మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. ప్రణయ్ హత్యపై మంత్రి ట్వీట్ చేశారు. ప్రణయ్ హత్య ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. కులం పేరుతో జరుగుతున్న ఇలాంటి దారుణాలను కూకటివేళ్లతో నిర్మూలించాలన్నారు. ప్రణయ్ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని మంత్రి కోరారు. ప్రణయ్ కుటుంబానికి, ఆయన భార్య అమృతకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App