facebook pixel
chevron_right Entertainment
transparent
బిగ్‌బాస్‌: అమిత్‌ కథ ముగిసింది!
బిగ్‌బాస్‌ సీజన్‌-2 తుది అంకానికి చేరింది. మరో రెండు వారాల్లో ఈ రియాల్టీ షోకు తెరపడనుంది. ఇంకా హౌస్‌లో ఏడుగురు సభ్యులున్నారు. ఈ వారం ఒకరి ఎలిమినేషన్‌తో ఇంకా ఆరుగురు సభ్యులు మిగిలి ఉంటారు. మరో వారంలో మరొకరు హౌస్‌ను వీడనున్నారు. చివరకు ఐదుగురు కంటెస్టెంట్స్‌ డైరెక్ట్‌గా ఫైనల్‌కు చేరనున్నారు. అయితే ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు హౌస్‌లో పరిస్థితులను బట్టి ఎవరు ఎలిమినేట్‌ అవుతున్నారో ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చారు. కానీ గత రెండు వారాలుగా బిగ్‌బాస్‌ వారి అంచనాలను తలకిందులు చేస్తూ పెద్ద ట్విస్టే ఇచ్చాడు. దానికి తోడు శనివారం నాని కౌశల్‌పై సీరియస్‌ అవ్వడం. రెడ్‌ ఫిష్‌ స్టోరీ చెప్పడం పలు అనుమానాలకు దారితీసింది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App