facebook pixel
chevron_right Politics
transparent
'షా అవసరం లేదు.. సామాన్యుడు చాలు'
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ని ఓడించడానికి అమిత్‌ షా అవసరం లేదని, బీజేపీ సామాన్య కార్యకర్త చాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌తో అమిత్‌ షా పోటీ చేస్తే ఓడిస్తామన్న ఓవైసీ సవాల్‌కు స్పందిస్తూ. మజ్లిస్‌పై సామాన్య కార్యకర్తను బరిలో నిలిపి హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంటామన్నారు. టీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందం పెట్టుకొని కొన్ని సీట్లను గెలవడం కాదు దమ్ముంటే 100 సీట్లల్లో పోటీ చెయ్యాలని సవాల్‌ విసిరారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఆదివారం బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. అమిత్‌ షా సభ విజయవంతం కావడంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తున్నాయని ఎద్దేవా చేశారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App