facebook pixel
chevron_right Top
transparent
ఆసియా కప్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హాంగ్‌కాంగ్..
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2018 టోర్నమెంట్ రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుపై హాంగ్‌కాంగ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లా జట్టు గెలుపొందిన విషయం విదితమే. 137 పరుగుల భారీ తేడాతో నెగ్గిన బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకకు షాకిచ్చింది. అదే తరహాలో ఇప్పుడు పసికూన హాంగ్‌కాంగ్ జట్టు పాకిస్థాన్‌కు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమైంది. ఇక హాంగ్‌కాంగ్ టీంకు అన్షుమన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, పాకిస్థాన్ జట్టుకు సర్ఫరాజ్ అహ్మద్ నాయకత్వం వహిస్తున్నాడు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App