facebook pixel
chevron_right Top
transparent
నేను కేంద్రమంత్రిని, పెట్రోల్ ధరలు పెరిగితే నాకు ఇబ్బంది లేదు: వివాదాస్పద వ్యాఖ్యలు
కేంద్రమంత్రి రాందాస్ అథవాలే పెట్రోల్ ధరల పెరుగుదలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పెట్రోల్ ధరల పెరుగుదలపై రాందాస్ అథవాలే మాట్లాడుతూ. పెట్రో ధరలు పెరగడం వల్ల తనకు ఎలాంటి బాధ లేదన్నారు. తాను ఒక కేంద్రమంత్రిని అని, తన మంత్రి పదవి పోతే మాత్రం నేను బాధపడాల్సి వస్తుందని చెప్పారు. ధరల పెరుగుదలతో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ విషయాన్ని తాను అర్థం చేసుకోగలనని, ధరలను తగ్గించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App