facebook pixel
chevron_right Top
transparent
వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్లు
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో రెండు కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్‌లో త్వరలో డార్క్ మోడ్ ఫీచర్ లభ్యం కానుంది. ఈ ఫీచర్ ఇప్పటికే యూట్యూబ్, ట్విట్టర్‌లలో అందుబాటులో ఉంది. డార్క్ మోడ్ ఫీచర్‌ను ఆన్ చేసుకుంటే యాప్ స్క్రీన్ మొత్తం నల్లగా మారుతుంది. దీంతో చీకట్లో ఉన్నప్పుడు ఫోన్ తెరను చూసినా కళ్లపై పెద్దగా ప్రభావం ఉండదు. ఇక వాట్సాప్ రానున్న మరో ఫీచర్ ఏమిటంటే. ఇప్పటి వరకు వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లకు రిైప్లె ఇవ్వాలంటే ఆ మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేసి రిైప్లె ఇవ్వాల్సి వస్తోంది. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బంది ఉండదు. త్వరలో వాట్సాప్‌లో స్వైప్ టు రిైప్లె ఫీచర్ అందుబాటులోకి రానుంది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App