facebook pixel
chevron_right Top
transparent
మిర్యాలగూడలో ప్రారంభమైన ప్రణయ్ అంతిమయాత్ర
ప్రణయ్ కుమార్ అంతిమ యాత్ర ప్రారంభమయింది. ఉక్రెయిన్‌లో ఉంటున్న ప్రణయ్ తమ్ముడు అజయ్ కుమార్ ఇవాళ మధ్యాహ్నం మిర్యాలగూడకు చేరుకున్నాడు. అన్న మృతదేహాన్ని చూసి అజయ్ బోరున విలపించాడు. ప్రణయ్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం ప్రణయ్ అంతిమ యాత్రను ప్రారంభించారు. మరోవైపు ప్రణయ్ హత్యకేసులో పాతబస్తీకి చెందిన రౌడీషీటరే హంతకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కరీం స్నేహితుడు ఖాసీం ద్వారా రాయబారం నడిచినట్లు తెలుస్తోంది. ప్రణయ్ కేసులో హంతకుడికి రూ.10 లక్షలు చెల్లించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రణయ్ హత్యకేసులో కాంగ్రెస్ మిర్యాలగూడ అధ్యక్షుడు కరీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App