facebook pixel
chevron_right Top
transparent
సీబీఎస్ఈ టాపర్ అత్యాచార ఘటన: తొలి అరెస్టు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్
కొన్ని రోజుల క్రితం హర్యాణాలో సీబీఎస్ఈ టాపర్ అయిన అమ్మాయిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. చదువుల సరస్వతిపై కొందరు కామాంధులు కాటేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తొలి అరెస్టు చేశారు. గతకొన్ని రోజులుగా నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారు. అయితే పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తిని కనీనాకు చెందిన దీన్‌దయాల్‌గా గుర్తించారు. అమ్మాయిని దీన్‌దయాల్ బస్టాండు సెంటర్‌లో వదిలేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఆయన ట్యూబ్‌వెల్‌ షాపు ఓనరని చెప్పారు. మరోముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. చదువుల సరస్వతిపై కామాంధుల కాటు ముగ్గురు నిందితుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. నిందితుల్లో ఒకరు జవాను కూడా ఉన్నాడు. వీరికి సంబంధించిన సమాచారం అందిస్తే లక్ష రూపాయలు బహుమానం ప్రకటించారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App