facebook pixel
chevron_right Top
transparent
మత ఘర్షణలకు దారితీసిన మూకహత్య
దేశంలో మూక హత్యలు ఆగడం లేదు. తాజగా మణిపూర్‌లో చోటుచేసుకున్న మూకహత్య ఆ ప్రాంతంలో మతఘర్షణలకు దారితీసింది. తౌబాల్ జిల్లాలో లిలాంగ్‌కు చెందిన 26 ఏళ్ల ఫరూఖ్‌ ఖాన్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. ఫరూఖ్‌ ప్రయాణిస్తున్న వాహనం గురువారం తెల్లవారుజామున పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాలోని థరోజమ్‌ గ్రామానికి చేరుకోంది. అయితే ఫరూఖ్‌ను, అతని స్నేహితులను వాహనాల దొంగలుగా భావించిన ఆ గ్రామ ప్రజలు వారిపై దాడికి దిగారు. అంతేకాకుండా వారి కారును కూడా ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఫరూఖ్‌తో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు తప్పించుకోగా. తీవ్రంగా గాయపడిన ఫరూఖ్‌ మృతి చెందాడు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు మూకహత్యతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App