facebook pixel
chevron_right Top
transparent
బెంగళూరులో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య, మూడు రోజుల తరువాత!
కుటుంబ సమస్యల కారణంగా ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో జరిగింది. యశవంతపురంలో నివాసం ఉంటున్న ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారని ఆదివారం వెలుగు చూసింది. యశవంతపురంలోని ముత్యాలనగర్ లో గత రెండు సంవత్సరాల నుంచి శేషశయన, అతని భార్య ఉషా, అతని తల్లి సుధా నివాసం ఉంటున్నారు. శేషశయన టైలర్ పని చేస్తూ కుటుంబ సభ్యులను పోషిస్తున్నాడు. గత మూడు రోజుల నుంచి వీరు ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రాలేదు. శేషశయన ఇంటి నుంచి దుర్వాసన వస్తున్న విషయం గుర్తించిన స్థానికులు ఆదివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App