facebook pixel
chevron_right Sports
transparent
భారత్‌×పాక్‌ను ఈ సారైనా చూస్తామా?
అభిమానుల భావోద్వేగాలు కట్టలు తెంచుకుంటాయి. దాయాదిపై తిరుగులేని విజయం సాధించి స్వదేశంలో తలెత్తుకు తిరగాలని ఆటగాళ్లు భావిస్తారు. ఇక మైదానంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు జనం వరుస కడతారు. టికెట్ల కోసం తిప్పలు పడతారు. ఆసియాకప్‌-2018లోనూ భారత్‌, పాకిస్థాన్‌ పోరు ఆసక్తికరం కానుంది. సెప్టెంబర్‌ 19న దాయాదుల పోరుకు దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మైదానం వేదిక కానుంది. ఇంతకీ సంగతేమిటంటే భారత్‌, పాక్‌ ఇప్పటి వరకు ఆసియా కప్‌ ఫైనల్లో తలపడలేదు. ఎప్పుడూ లీగ్‌ దశకే పరిమితం అవుతున్నారు. ఈ సారైన ఫైనల్‌ మాజా అందిస్తారో లేదో చూడాలి. 1984లో భారత్‌ తొలుత 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రోజర్‌ బిన్నీ, రవిశాస్త్రి చెరో 3 వికెట్లతో విజృంభించడంతో పాక్‌ 134 పరుగులకే ఆలౌటైంది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App