facebook pixel
chevron_right Top
transparent
లీటర్ పెట్రోల్, డీజిల్‌ను రూ.35కే ఇస్తా!
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రధాని మోదీ కొంప ముంచుతాయని అన్నారు యోగా గురు రాందేవ్ బాబా. అంతేకాదు ప్రభుత్వం తనకు పన్నుల్లో కాస్త ఉపశమనం కలిగిస్తే. తాను లీటర్ పెట్రోల్, డీజిల్‌ను కేవలం రూ.35 నుంచి రూ.40 కే అందిస్తానని ఆయన చెప్పడం విశేషం. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందికి తీసుకురావాలని, అది కూడా 28 శాతం శ్లాబ్ కిందికి తీసుకురావద్దని రాందేవ్ సూచించారు. పెరుగుతున్న ధరలపై మోదీ ఏదో ఒక చర్య తీసుకోవాలని, లేదంటే ఆయనకు కష్టాలు తప్పవని ఆయన స్పష్టంచేశారు. ఇక ఇతర అంశాలపైనా రాందేవ్ బాబా స్పందించారు. యువతలో అసహనం పెరిగిపోతున్నదని, అవకాశాలు లేవని వాళ్లు భావిస్తున్నారని ఆయన అన్నారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App